Dil Raju : తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) తన తల్లి ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు. లేనిపోని వార్తలను ప్రసారం చేయడం మానుకోవాలని సూచించారు. తన తల్లికి ప్రస్తుతం 81 ఏళ్లు అని, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, డిశ్చార్జ్ కూడా చేస్తామని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.
Dil Raju Comment
ఇదిలా ఉండగా ఐటీ దాడుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఇవి మామూలేనని అన్నారు. తాము పట్టించు కోవడం లేదని చెప్పారు. కొందరు కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ఇది తగదన్నారు. కొంత సంయమనం పాటించాలని సూచించారు దిల్ రాజు.
తన ఒక్కడి మీదనే ఐటీ సోదాలు చేపట్టినట్లు జోరుగా ప్రచారం చేశారంటూ వాపోయారు. తమతో సంప్రదిస్తే వివరాలు చెబుతామన్నారు. రోటిన్ గా ఎప్పుడూ జరిగిదేనని పేర్కొన్నారు. తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని చెప్పారు.
ఇదిలా ఉండగా ఈ కొత్త ఏడాది తనకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీతో గేమ్ ఛేంజర్ తీశాడు. ఇది బొక్క బోర్లా పడింది. మెగాస్టార్ , పవన్ కళ్యాణ్ ఎంతగా పైకి లేపినా సక్సెస్ దరి దాపుల్లోకి కూడా రాలేదు.
ఇదే సమయంలో విక్టరీ వెంకటేశ్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం నిర్మించాడు. అత్యంత తక్కువ బడ్జెట్ తో తీసిన దిల్ రాజుకు ఊహించని సక్సెస్ దక్కింది. ఏకంగా ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ. 235 కోట్లను దాటేసింది. ఇది సినీ వర్గాలను విస్మయానికి గురి చేసింది.
Also Read : Hero Mahesh-SSMB29 : మహేష్ బాబు నెట్టింట్లో వైరల్