తమిళ సినీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. దమ్మున్న, క్రియేటివ్ కలిగిన దర్శకులు భిన్నమైన సినిమాలను తీస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కష్ట పడుతున్నారు. ఇక నటీ నటుల గురించి చెప్పాల్సిన పని లేదు.
టాప్ నటులు తమదైన పాత్రలలో ఒదిగి పోతూ రక్తి కట్టిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే 73 ఏళ్ల వయసులో రూ.650 కోట్లు సాధించిన జైలర్ లో నటించి మెప్పించాడు రజనీకాంత్ . తాజాగా విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా డక్కీమొక్కీలు తిని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మేరకు ధృవ నక్షత్రం సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దీనికి దర్శకత్వం వహించారు. దీపక్ వెంకటేశన్ స్క్రీన్ ప్లే చేపట్టారు. దీనికి నిర్మాత కూడా దర్శకుడే కావడం విశేషం.
ఈ చిత్రంలో విక్రమ్ తో పాటు రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటించారు. మనోజ్ పరమ హంస సినిమాటోగ్రఫీ అందించారు. హరీశ్ జయరాజ్ సంగీతం అందించారు. మీనన్ ప్రతి సినిమా కొత్తగా ఉంటుంది. మరి ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.