Dhruva Natchathiram : తమిళ సినీ రంగంలో ఇద్దరూ ఇద్దరే. ఒకరు మోస్ట్ టాలెంటెడ్ , క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్. మరొకరు ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగి పోయే ప్రతిభావంతమైన నటుడు విక్రమ్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ధ్రువ నచ్చతిరం(Dhruva Natchathiram). తొలి అధ్యాయం యుద్ద కాండమ్ అని పేరు పెట్టారు. గౌతమ్ వాసుదేవ మీనన్ అంటేనే క్రియేటివిటీకి పెట్టింది పేరు. సన్నివేశాలను అత్యంత ఆకట్టుకునేలా తీయడంలో తనకు తనే సాటి.
Dhruva Natchathiram Updates
ఈ చిత్రాన్ని మనసు పెట్టి తీశానని చెప్పాడు. కథ, స్క్రీన్ ప్లే కూడా తనే. ధ్రువ నచ్చతిరమ్ కు దీపక్ వెంకటేషన్ తో పాటు గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా నిర్మాత. ఈ మూవీలో విక్రమ్ తో పాటు రీతూ వర్మ, ఆర్. పార్తిబన్ , రాధికా శరత్ కుమార్ , సిమ్రాన్ , వినాయకన్ నటించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించారు. హరీశ్ జయరాజ్ చేసిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
నవంబర్ 24న ధ్రువ నచ్చతిరమ్ విడుదల కానుంది. సినిమా రన్నింగ్ టైం గంటా 45 నిమిషాలు. తమిళంలో తీశాడు. ఇది పూర్తిగా గూఢచారి యాక్షన్ మూవీ. ఈ చిత్రం తొలుత సూర్యతో చేయాల్సి ఉంది. కానీ మీనన్ తో సరిపోక విరమించుకున్నాడు. 2016లో నిర్మాణం ప్రారంభించాడు. ఏడు దేశాలలో దీనిని తీశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి లో గౌతమ్ వాసుదేవ మీనన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయాడు. మొత్తంగా ఈ చిత్రంపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నాడు దర్శకుడు. ఇది విక్రమ్ కంటే మీనన్ కు ముఖ్యం .
Also Read : Tiger 3 Movie : టైగర్ జిందా హై బాస్