Dhruva Nakshatram: దృవనక్షత్రం రిలీజ్ కు ఆర్ధిక కష్టాలు… ఆందోళనలో అభిమానులు

దృవనక్షత్రం రిలీజ్ కు ఆర్ధిక కష్టాలు... ఆందోళనలో అభిమానులు

Hello Telugu - Dhruva Nakshatram

Dhruva Nakshatram : కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా దృవనక్షత్రం (తమిళంలో దృవనచ్చితిరం). ఎనిమిదేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ సినిమా అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు వచ్చే శుక్రవారం (నవంబరు 24) విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెంగుళూర్, ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ కూడా అయిపోయాయి. అయితే ఈ సినిమా విడుదలపై మరోసారి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమా విడుదల చేయాలంటే 8 కోట్లు చెల్లించాలంటూ కొంతమంది దర్శకుడు గౌతమ్ మీనన్ ను డిమాండ్ చేయడమే కారణమని సినీ వర్గాల సమాచారం.

Dhruva Nakshatram – 8 కోట్లు చెల్లించిన తరువాత దృవనక్షత్రం రిలీజ్ కు ఆమోదం

2017 నుండి వివిధ కారణాలతో దృవనక్షత్రం(Dhruva Nakshatram) రిలీజ్ కు వాయిదా పడుతుండటంతో కొంతమంది మద్రాసు కోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలో అటువంటి సమస్యలను పరిష్కరించడానికి 8 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనితో ఆ డబ్బు చెల్లిస్తే తప్ప ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టం అని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన కలల ప్రాజెక్టు దృవనక్షత్రం కోసం యాక్టర్ గా మారి వచ్చిన రెమ్యునరేషన్ తో సినిమాను పూర్తి చేసిన గౌతమ్ మీనన్… ఈ అడ్డంకులను ఎలా అధిగమిస్తాడు అనేది ఆశక్తికరంగా మారింది. అయితే కొంతమంది డిస్ట్రీబ్యూటర్స్ దర్శకుడు గౌతమ్ మీనన్ కు సహాయం చేయడానికి ముందుకు రావడంతో దృవనక్షత్రం సినిమా వచ్చే శుక్రవారం రిలీజ్ చేయడం ఖాయమని సినీ వర్గాల సమాచారం.

గౌతమ్ మీనన్ కలల ప్రాజెక్టు దృవనక్షత్రం

సూర్య సన్నాఫ్ కృష్ణన్, రాఘవన్, ఏం మాయ చేసావే, ఎంత వాడు గానీ, ఘర్షణ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్… మణిరత్నం తర్వాత అంత పొయిటిక్ గా ప్రేమని ప్రెజెంట్ చేయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. గౌతమ్ మీనన్ కు స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలోనే 2016లో చియాన్ విక్రమ్ తో దృవనక్షత్రం సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వివిధ కారణాల వలన ఆ సినిమా ఎనిమిదేళ్ళుగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించిని ఈ సినిమాకు హారిష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Pawan Kalyan: స్పెషల్ గెస్ట్ ను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com