Mari Selvaraj : తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్, పవర్ ఫుల్ దర్శకుడిగా పేరు పొందాడు మారి సెల్వరాజ్. తన టేకింగ్ భిన్నంగా ఉంటుంది. తను చెప్పాల్సిన కథను ప్రేక్షకుల మనసులోకి తీసుకు వెళ్లడంలో తనకు తనే సాటి. ఈ దర్శకుడు తీసిన కర్ణన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంచనాలు మించి ఆడింది. కాసులు కురిపించేలా చేసింది. ఇక నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఉర్తింపు పొందిన ధనుష్ కీలక అప్ డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తాను మారి సెల్వరాజ్(Mari Selvaraj) తో కొత్త ప్రాజెక్టును చేయబోతున్నట్లు వెల్లడించాడు.
Mari Selvaraj – Dhanush Movie Updates
ఇక తను నిత్యా మీనన్ తో కలిసి తీసిన ఇడ్లి కడై (ఇడ్లీ కొట్టు) విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రానికి చెందిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ హృదయాన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టానంటూ తెలిపాడు ధనుష్. అంతే కాకుండా మారి సెల్వరాజ్ తో జతకట్టక ముందు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా కథా చర్చల్లో పాల్గొన్నట్టు టాక్.
తను అల్లు అర్జున్ తో సినిమా తీయాలని అనుకున్నాడు కథ కూడా వినిపించాడు. దానికి ఓకే చెప్పినా బన్నీ ఇప్పుడు అట్లీ కుమార్ తీసే ఇంటర్నేషనల్ మూవీకి సరెండర్ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ కు కష్టమే. ఈ సమయంలో ధనుష్ తో సినిమా తీస్తారని అనుకున్నారు. అది కూడా తాజా ప్రకటనతో బ్రేక్ పడిందని తేలి పోయింది. మొత్తగా ధనుష్ చేసిన తాజా ప్రకటన తమిళ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఇద్దరూ కలిసి తీయబోయే కొత్త ప్రాజెక్టు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.
Also Read : Hero Jr NTR-Neel :తారక్ తో కీలక సన్నివేశాలపై నీల్ ఫోకస్