Trivikram : టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్, డైనమిక్ డైరెక్టర్ గా పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కథలు రాసుకుని సిద్దం చేసుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు తను ఇష్టపడే హీరో అల్లు అర్జున్ తో చర్చలు జరిపాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. వాటిలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠంపురంలో. పీరియాడికల్ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని , దీనికి బన్నీ కూడా ఓకే చెప్పాడని టాక్.
Trivikram-Dhanush Movie
అయితే ప్రస్తుతం తను తమిళ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో జత కట్టాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇందులో పాన్ ఇండియా హీరోయిన్ సమంత నటించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో తను అట్లీతో బిజీగా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) తో సినిమా చేయడం కష్టం. దీనిని గమనించిన దర్శకుడు తన వద్ద కథలను ప్రముఖ తమిళ సినీ నటుడు ధనుష్ కు చెప్పినట్లు తను తనతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా పరిశ్రమలో వినిపిస్తోంది. తను నటుడే కాకుండా మంచి దర్శకుడు కూడా. ధనుష్, నిత్యా మీనన్ తో కలిసి నటించి, దర్శకత్వం వహించిన ఇడ్లి కడై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీపై బజ్ నెలకొంది.
దీంతో బన్నీ కంటే మేందు ధనుష్ తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ సిద్దమయ్యాడని వినికిడి. ధనుష్ హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మాతలతో దగ్గరి అనుబంధం ఉంది. దీని కారణంగానే తను దర్శకుడితో ఆంతరింగక చర్చలు కూడా జరిపారని, కథలన్నీ నచ్చాయని ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే సెట్స్ లోకి వెళ్లేందుకు తాను సిద్దమేనంటూ త్రివిక్రమ్ కు చెప్పేసినట్లు టాక్. దీంతో ధనుష్ మూవీ తర్వాత బన్నీతో మూవీ చేయబోతున్నాడన్న మాట. ఎంతైనా మాటల మాంత్రికుడు ఏమైనా చేయగలడు కదూ.
Also Read : Hero Manchu Vishnu-Kannappa :మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్