Dhak Dhak Movie : ముద్దుగుమ్మ‌ల ధ‌క్ ధ‌క్ కిర్రాక్

స‌నా షేక్..పాఠ‌క్..దియా మీర్జా

బాలీవుడ్ కు సంబంధించి కొత్త కొత్త ప్ర‌యోగాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా బాద్ షా న‌టించిన జైల‌ర్ దుమ్ము రేపింది. మ‌రో వైపు గ‌ద‌ర్ 2 సీక్వెల్ మూవీ బిగ్ స‌క్సెస్ . ఈ త‌రుణంలో కొత్త చిత్రాలు ముందుకు రానున్నాయి.

తాజాగా ఫాతిమా స‌నా షేక్ , ర‌త్న పాఠ‌క్ షా, దియా మీర్జ‌జా , సంఝ‌నా సంఘీ న‌టించిన రోడ్ ట్రిప్ మూవీ ధ‌క్ ధ‌క్ అక్టోబ‌ర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ధ‌క్ ధ‌క్ సినిమాను రిల‌య‌న్స్ కంపెనీకి చెందిన వ‌యాకామ్ 18 స్టూడియోస్ , తాప్సీ ప‌న్ను అవుట్ సైడ‌ర్స్ ఫిల్మ్స్ బ్యాక‌ప్ తో దీనిని నిర్మించారు.

ఇక న‌లుగురు ముద్దుగుమ్మ‌లు న‌టించిన ధ‌క్ ధ‌క్ చిత్రానికి త‌రుణ్ దూదేజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దూదేజా, పారిజాత్ జోషి క‌లిసి క‌థ‌ను రాశారు. ఈ మేర‌కు ఉత్కంఠ‌కు తెర దించుతూ విడుద‌ల తేదీని ఖ‌రారు చేశారు మూవీ మేక‌ర్స్.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ న‌టి తాప్సీ ప‌న్ను. ఆమె ప్ర‌ముఖ న‌టుడు షారుక్ ఖాన్ తో క‌లిసి డుంకీ సినిమాలో న‌టిస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాజూ హీర్వాణీ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ధ‌క్ ధ‌క్ క‌థ భిన్నంగా ఉండేలా తీర్చిదిద్దారు డైరెక్ట‌ర్. ఢిల్లీ నుండి ఖర్థుంగ్ లా వ‌ర‌కు బైక్ యాత్ర‌లో భావోద్వేగాలు , సాహసాలు , ఆవిష్క‌ర‌ణ‌ల కోసం చేసిన అసాధ‌ర‌ణ యాత్రనే ఈ చిత్రం.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com