Devisri Prasad : ప్రముఖ మాటల రచయిత సత్యానంద్ కొడుకే ఈ దేవీశ్రీ ప్రసాద్. హుషారైన సంగీతం కావాలంటే దేవిశ్రీ ప్రసాద్ ముందుగా గుర్తుకు వస్తాడు. మనల్ని మరింత సంతోషానికి గురి చేస్తాడు. పసందైన పాటల్ని మనకు అందించేందుకు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే అతడిని ఇండయిన్ మ్యూజిక్ రాక్ స్టార్ అంటారు.
Devisri Prasad Got National Award
తను వచ్చాక చాలా మంది కొత్త సింగర్స్ ను పరిచయం చేశాడు. ఎన్నో అద్భుతమైన పాటలు అందించాడు. ఆయన ఇచ్చిన మ్యూజిక్ తో సినిమాలు ఆడినవి ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో కూడా తనకు తనే సాటి.
ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సంగీత దర్శకులలో ఒకడిగా ఉన్నాడు దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad). ఆయనతో పాటు ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ థమన్ పోటీ పడుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం దుమ్ము రేపింది.
పాటల పరంగా టాప్ రేంజ్ లో నిలిచాయి. ప్రధానంగా ఊ అంటావా మామ ఊ అంటావా సాంగ్ ఊపేసింది. ఇక ఇదే సినిమాలో సామి సామి అంటా వుంటే అనే పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో తాజాగా జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డులలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడు.
Also Read : Uppena Movie : అవార్డును తాకిన ‘ఉప్పెన’