Devi Sri Prasad: తన 25 ఏళ్ల కెరీర్‌ పై దేవీశ్రీ ప్రసాద్‌ ఎమోషన్ పోస్ట్‌ !

తన 25 ఏళ్ల కెరీర్‌ పై దేవీశ్రీ ప్రసాద్‌ ఎమోషన్ పోస్ట్‌ !

Hello Telugu - Devi Sri Prasad

Devi Sri Prasad: మాస్, క్లాస్, మెలోడీ, ఐటెం సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని తేడా లేకుండా తన ఆట, పాటలతో సంగీత ప్రియులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే అతి తక్కువ మంది సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్‌(Devi Sri Prasad) ఒకరు. సినిమాకు సంగీతం అందించడంతో పాటు… ఆడియో రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, చివరకు సినిమా సక్సెస్ మీట్ లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో తన ఆట, పాటలతో సంగీత ప్రేక్షకులతో పాటు సినీ ప్రియులను, సెలబ్రెటీలను ఉర్రూత లూగిస్తుంటారు. సింగర్ గా, మ్యూజీషియన్ గా, డ్యాన్సర్ గా స్టేజ్ పై వన్ మ్యాన్ షోతో సినిమాకు హైప్ తేవడంతో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు. ఈ టాలెంటెడ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తాజాగా దీనిపై ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు. తన గురువు ఇళయరాజా తన స్టూడియోకు రావడంతో కల నెరవేరిందన్నారు. ఆయనతో దిగిన ఫొటోలను… సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Devi Sri Prasad Post Viral

‘చిన్నతనంలో సంగీతం అంటే ఏమిటో తెలియనప్పుడే ఇళయరాజా సంగీతం వింటుంటే అద్భుతంగా అనిపించేది. పరీక్షలకు చదువుకునే సమయంలోనూ ఆయన పాటలు వింటూ ఉండేవాడిని. ఆయన సంగీతం నాకు ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే నేను సంగీత దర్శకుడిగా ఎదిగాను. సంగీత దర్శకుడినయ్యాక నా స్టూడియోలో ఇళయరాజా పెద్ద ఫొటో పెట్టుకున్నాను. ఆయన ఒక్కరోజైనా నా స్టూడియోకు వచ్చి ఇక్కడ నిల్చుంటే కలిసి ఫొటో దిగాలని కలలు కన్నాను. ఈరోజు నా కల నిజమైంది. దీన్ని జీవితంలో మర్చిపోలేను. ఆయన రాకతో నా స్టూడియోకు ఆధ్యాత్మికత వచ్చింది’ అని రాసుకొచ్చారు. ఈసందర్భంగా తనకు అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు, అభిమానిస్తున్న ప్రేక్షకులకు దేవీశ్రీ ప్రసాద్‌ ధన్యవాదాలు చెప్పారు.

1999లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో దేవీశ్రీ ప్రసాద్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ ను అందుకున్న దేవి(Devi Sri Prasad)…. ఆ తరువాత ‘ఆనందం’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘సొంతం’, ‘వర్షం’… ఇలా ఎన్నో సినిమాలకు మ్యూజిక్‌ అందించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అత్యధికంగా 11 సార్లు నామినేటై రికార్డు సృష్టించారు. ‘పుష్ప’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

Also Read : Manchu Laxmi Prasanna: హాట్ ఫొటోల‌తో విధ్వంసం సృష్టిస్తోన్న మంచు ల‌క్ష్మి !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com