Devara: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ‘దేవర(Devara)’గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు.రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్టును సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాజా పోస్టర్ తో తేలిపోయింది. విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అంతేకాదు సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల అవుతుందని తెలుపుతూ ఓ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
Devara Movie Updates
ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజన్స్, కొరటాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర(Devara) సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ తో పాటు రెండో సాంగ్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనితో దేవర సినిమా నుంచి రెండో పాట ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో తారక్ చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నారు. అందులో జాన్వీ కపూర్ తో తారక్ ఉన్న ఫోటో తొలిసారి విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇటీవల మొదటి సింగిల్ ‘ఫియర్ సాంగ్’ ను రిలీజ్ చేయటం ద్వారా ఫిల్మ్ మేకర్స్ ‘దేవర(Devara)’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అన్నీ మాధ్యమాల్లో గ్లోబల్ రేంజ్ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఈ పాటకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచంద్రన్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు రెండో పాటు విడుదల కానుంది. ఈ మెలోడీ సాంగ్‌కు ఏ రేంజ్‌లో ట్యూన్స్ ఉంటాయోనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఈ పోస్టర్ చూస్తుంటే రాబోయే సాంగ్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే హింట్ ఇస్తోంది. ఈ పోస్టర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్మైలింగ్ బ్యూటీ జాన్వీ కపూర్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఈ పాట ఈ సినిమాకే హైలెట్ అనేలా చిత్రీకరణ జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇక పాట వస్తే.. ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పొచ్చు.
Also Read : Anupam Kher: ‘ది ఇండియా హౌస్’ సెట్లో అడుగుపెట్టిన అనుపమ్ ఖేర్ !