టేకింగ్ లోనూ టైమింగ్ లోనూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. తను తీసినవి కొన్ని సినిమాలే అయినా పవర్ ఫుల్ మెస్సేజ్ తో పాటు యాక్షన్ ఉండేలా జాగ్రత్త పడతాడు. చిరంజీవి, రామ్ చరణ్ తో తీసిన ఆచార్య పల్టీ కొట్టింది.
దీంతో నెక్ట్స్ సినిమా ఏది అనే ఉత్కంఠకు తెర దించుతూ మోస్ట్ పాపులర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కన్ ఫర్మ్ చేశాడు. ఏకంగా షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు.
రోజుకో అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు కొరటాల. దమ్మున్న నటుడిగా పేరు తెచ్చుకున్న తారక్ తో జోడీగా అలనాటి అందాల నటి, దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ను ఎంపిక చేశాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాకు దేవర అని పేరు పెట్టాడు. చాలా మంది ఈ పేరును చూసి విస్మయానికి లోనయ్యారు. విచిత్రం ఏమిటంటే నటుడు దమ్మున్నోడు కాబట్టి అతడికి సరి పోయేలా పేరు పెట్టానని ప్రకటించాడు దర్శకుడు. దేవర అంటే దేవుడు అని అర్థం.
ప్రస్తుతం మూవీకి సంబంధించి స్టన్నింగ్ లుక్స్ బయటకు వచ్చాయి. ఇందులో ప్రతి నాయకుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఆయన బర్త్ డేను పురస్కరించుకుని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు ఎన్టీఆర్ , జాహ్నవి స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి.