టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఒకే ఒక్క పేరు కొరటాల శివ. తను పాన్ ఇండియా లెవల్లో డైనమిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ కూడా రివీల్ చేశాడు. దేవర అని పేరు పెట్టాడు. గతంలో తారక్ తో కొరటాల శివ జనతా గ్యారేజ్ తీశాడు. అది సూపర్ హిట్ .
ఇదే సమయంలో కథ నచ్చడంతో మరోసారి కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చానని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించి షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. దేవర మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రత్యేకించి తారక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేలా చేస్తున్నాయి.
మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా తారక్ భీకరంగా చూస్తున్న పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో జూనియర్ సరసన ఆనాటి అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తుండడం విశేషం. విచిత్రం ఏమిటంటే తను మూడు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పడం కలకలం రేపింది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవరను రిలీజ్ చేస్తామని ప్రకటించాడు కొరటాల శివ.