Jailer RCB Jersy : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రానికి బిగ్ షాక్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. జైలర్ మూవీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు చెందిన జెర్సీని ఉపయోగించడం వెంటనే తొలగించాలని ఆదేశించింది. వెంటనే ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.
Jailer RCB Jersy Viral
ఇది సెప్టెంబర్ 1 నుంచి అమలులో లోకి వస్తుందని పేర్కొంది. ఆర్సీబీ(RCB) జెర్సీని జైలర్ సినిమాకు సంబంధించి ఎక్కడా ఉపయోగించ కూడదని ఆదేశించింది. టెలివిజన్ , శాటిలైట్ లేదా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో కూడా జైలర్ ప్రదర్శించే సమయంలో ఉండ కూడదని పేర్కొంది.
తమ టీమ్ కు చెందిన జెర్సీని జైలర్ సినిమాలో వాడుకోవడంపై తీవ్ర అభ్యర్థం తెలిపింది ఆర్సీబీ యజమాన్యం. ఈ మేరకు ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఆర్సీబీ జెర్సీకి సంబంధించి విచారణ చేపట్టింది. సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
కోర్టు తీర్పు మేరకు జైలర్ మూవీ టీం స్పందించింది. వెంటనే జెర్సీని తొలగించే ప్రయత్నం చేస్తామని ఈ మేరకు కోర్టుకు తెలిపింది చిత్ర నిర్మాతలు. ఇదిలా ఉండగా రజనీకాంత్ నటించిన జైలర్ ఆగస్టు 10న విడుదలైంది. 18 రోజుల్లో రూ. 600 కోట్లు వసూలు చేసింది. ఇది తన సినీ కెరీర్ లో రికార్డ్ బ్రేక్.
Also Read : NTR Nara Lokesh : తెలుగు జాతికి దక్కిన గౌరవం