Deepika Padukone : దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన వయసు 39 ఏళ్లు. రణ బీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. తొలుత మోడల్ గా ఆ తర్వాత నటిగా ఎదిగింది. 2004 నుంచి ఇప్పటి దాకా క్రియాశీలకంగా ఉన్నారు. ఆ మధ్యన బాద్ షా షారుక్ ఖాన్ తో జవాన్ లో నటించింది. దీనికి తమిళ సినీ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వం వహించారు. తన తండ్రి ఎవరో కాదు భారత దేశంలో పేరు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే. 2018లో పెళ్లి చేసుకున్నా నటించడం మానుకోలేదు.
Deepika Padukone…
2022లో మే నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగే 75వ కేన్స్ ఫిలిం పెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో సభ్యురాలిగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణే(Deepika Padukone) నియమితులయ్యారు. అంతే కాదు 2015లో ఆమె తనిష్క్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
దీపిక డెన్మార్క్ లోని కోపెన్ హగెన్లో ఉజ్వల, ప్రకాష్ పడుకోనె దంపతులకు జనవరి 5, 1986లో జన్మించింది. ఆమె కుటుంబం ఇండియాలోని బెంగుళూరుకు మారినపుడు ఆమెకు పదకొండు నెలలు. తల్లి ట్రావెల్ ఏజెంట్. దీపికాకు(Deepika Padukone) ఓ చెల్లెలు మరో తమ్ముడు కూడా ఉన్నారు.
దీపిక బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకుంది. మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువు పూర్తి చేసింది.హైస్కూల్లో ఉన్నపుడు ఆమె తన తండ్రిలానే రాష్ట్రస్థాయిలో బ్యాడ్మింటన్ ఆడింది. బ్యాడ్మింటన్ క్లబ్‌లో సభ్యురాలు కూడా.
కాలేజీ రోజుల్లో ఉండగా దీపిక(Deepika Padukone) మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంది . కొద్ది కాలంలోనే ఆమె ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, లాల్ పౌడర్, క్లోజప్ టూత్ పేస్టు, లిమ్కా ప్రకటనల్లో నటించింది. మేబెల్లిన్ అనే కాస్మెటిక్స్ కంపెనీ ఆమెను అంతర్జాతియ అధికార ప్రతినిధిగా నియమించుకుంది.
కింగ్ ఫిషర్ ఫ్యాషన్ అవార్డులలో ఆమెకు మోడల్ అఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. స్విం సూట్ కాలెండరు 2006కి ఒక మోడల్‌గా తీసుకొనబడింది. లేవి స్ట్రాస్ , టిస్సోట్ ఎస్ ఎ లకు బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారు. ఆమె హిమేష్ రేషమ్మియా తీసిన స్వతంత్ర ఆల్బం ఆప్ కా సురూర్ లోని నాం హై తేరా అనే పాటకి మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన కెరీర్‌ని మొదలు పెట్టింది.
2006లో పడుకోణె ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత ఆమె 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరాఖాన్ తీసిన విజయవంతమైన బాలీవుడ్ చిత్రం ఓం శాంతి ఓం లో నటించింది. ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం సంపాదించి పెట్టింది. ఆ తర్వాత తనకు ఎదురే లేకుండా పోయింది.
Also Read : Popular Actress Silk Smitha :సిల్క్ స్మిత జీవితమే ఓ కథ