బాలీవుడ్ లో దీపికా పదుకొనే గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇక మరో హీరో రణ్ వీర్ సింగ్ తో పెళ్లి చేసుకున్నాక మరీ బిజీగా మారి పోయింది ఈ అమ్మడు. ఈ ఏడాది ఆమెకు మంచి సినిమాలు దక్కాయి. ప్రత్యేకించి షారుక్ ఖాన్ తో పెయిర్ కుదిరింది.
తామిద్దరు కలిసి నటించిన పఠాన్ రూ. 1,000 కోట్లను క్రాస్ చేసింది. ఇక తాజాగా అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ సైతం దుమ్ము రేపింది. అది కూడా వేయి కోట్లకు దగ్గరగా వచ్చింది.
వరుస సినిమాల సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం బుల్లి తెరపై టాప్ షోగా పేరు పొందింది ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కరణ్ విత్ కాఫీ ప్రోగ్రాం.
ఇందులో దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ కలిసి పాల్గొంటున్నారు. కరణ్ వేసే ప్రతి ప్రశ్నకు సావధానంగా ఆన్సర్స్ ఇచ్చారు పోటీ పడి ఇద్దరూ. మొత్తంగా ఎక్కువగా లోన్లీ నెస్ ను ఇష్టపడే దీపికా ఇప్పుడు వైరల్ గా మారడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆమె తండ్రి భారత దేశ క్రీడా రంగంలో పేరు పొందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనే. దీపికాది కర్ణాటక. ప్రస్తుతం ముంబైని ఏలుతోంది.