Deepika Padukone : బాలీవుడ్ నటి దీపికా పదుకొనే షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టార్ కావాలంటే దమ్ముండాలని ఎక్కడికో వెళితేనో లేదా అందాలను ఆరబోస్తేనే పాపులర్ కారంటూ పేర్కొంది. ఈ ఏడాది దీపికా పదుకొనేకు రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఆ రెండు సినిమాలు బాలీవుడ్ బాద్ షా కింగ్ షారుక్ ఖాన్ తో కలిసి చేసినవే కావడం.
Deepika Padukone Inspiration
ఈ రెండు సినిమాలు పఠాన్, జవాన్. విచిత్రం ఏమిటంటే ఈ చిత్రాలు ఏకంగా రూ. 1,000 కోట్లు కలెక్షన్స్ సాధించాయి. ఇది ఓ రికార్డ్ కూడా. అంతే కాదు ఓటీటీలో సైతం అత్యధిక వ్యూయర్ షిప్ సాధించి రికార్డ్ క్రియేట్ చేశాయి.
ఇక అట్లీ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జవాన్ లో ఓ పాటలో తళుక్కున మెరిసింది. సినిమా రంగానికి సంబంధించి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది దీపికా పదుకొనే. ఒక్క జవాన్ చిత్రానికి సంబంధించి ఏకంగా రూ. 20 కోట్లు తీసుకుందని టాక్. ఇదే సమయంలో షారుక్ ఖాన్ కు పోటీగా నటించిన నయన తార 8 నుంచి రూ. 10 కోట్లు తీసుకుందని సమాచారం.
మొత్తంగా పాపులర్ కావాలంటే ఏం చేయాలో కుండ బద్దలు కొట్టింది దీపికా పదుకొనే(Deepika Padukone). ప్రస్తుతం దీపికా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Kajal Aggarwal : కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ సూపర్