Decoit: అడివి శేష్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ ఈ సినిమాకు సహ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్ లోకి శృతిహాసన్ అడుగు పెట్టింది. ఈ విషయాన్ని శృతితో పాటు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా శేష్, శృతిలపై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
Decoit Movie Updates
‘డెకాయిట్’ కు అడివి శేష్ దీనికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్.
Also Read : Nithya Menon: నితిన్ సినిమాలో అతిథి పాత్రకు నిత్యామీనన్ సై ?