Dear Nanna: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్యరావు హీరోగా నటించిన తాజా సినిమా ‘డియర్ నాన్న(Dear Nanna)’. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ సూర్య(Suriya) కీలక పాత్రలో పోషించారు. ప్రేమ, జీవితం, వారసత్వం అనే అంశాల చుట్టూ సాగే ఈ సెంటిమెంట్ సినిమా… తండ్రీ కొడుకుల ఎమోషన్స్‌తో హార్ట్ టచింగ్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఫాదర్స్ డే స్పెషల్ గా… డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘డియర్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయడంతో పాటు మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Dear Nanna – ‘డియర్ నాన్న’ కథేమిటంటే ?
ఓ మెడికల్ షాప్‌ను రన్ చేసే వ్యక్తి తన కొడుకును కూడా ఫార్మసిస్ట్గానే చూడాలని కోరుకుంటాడు. తాను రన్ చేసే మెడికల్ షాప్ బాధ్యతలను కొడుకుకు అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. కాని మెడికల్ షాప్ ఓనర్ కొడుకు మాత్రం చెఫ్ కావాలని కలలు కంటాడు. భిన్న మనస్తత్వాలు, ఆలోచనల కారణంగా తండ్రి, కొడుకుల మధ్య ఎలా దూరం పెరిగింది? తండ్రి కోరికను కొడుకు నెరవేర్చాడా? కొడుకు కలలనుతండ్రి అర్థం చేసుకున్నాడా? అనే పాయింట్‌తో డియర్ నాన్న మూవీ తెరకెక్కింది.
30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్‌తో ఫేమస్ అయ్యాడు చైతన్యరావు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ కామెడీ వెబ్‌సిరీస్ మిలియన్లలో వ్యూస్‌ను దక్కించుకున్నది. 30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్ తర్వాత చైతన్యరావు సినిమా ఛాన్స్‌లు పెరిగాయి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు. చైతన్యరావు హీరోగా నటించిన షరతులు వర్తిస్తాయి. మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో మిడిల్ క్లాస్ యువకుడిగా నాచురల్ యాక్టింగ్‌తో చైతన్యరావు మెప్పించాడు. తరుణ్ భాస్కర్ కీడాకోలాలో డబ్బు కోసం ఆశపడి కష్టాల్లో పడే యువకుడిగా తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలతో పాటు పారిజాత పర్వం, అన్నపూర్ణ ఫొటో స్టూడియో, వాలెంటైన్స్ నైట్స్ సినిమాల్లో హీరోగా కనిపించాడు చైతన్యరావు. తిమ్మరుసుతో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. ప్రస్తుతం హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు9 మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.
Also Read : Varun Sandesh: ఆశక్తికరంగా వరుణ్ సందేశ్ ‘నింద’ ట్రైలర్ !