Nayanthara : రోజు రోజుకు ముదురుతున్న నయనతార డాక్టర్ మధ్య ముదురుతున్న వివాదం

దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను సమతౌల్యంగా ఉంచుతుందని తెలిపింది...

Hello Telugu - Nayanthara

Nayanthara : ఇటీవల కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ హీరోయిన్ సమంత చేసిన హెల్త్ పోస్ట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయని సలహా ఇవ్వడంతో.. సమంతపై సీరియస్ అయ్యారు ది లివర్ డాక్. సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలకే రిస్క్ అంటూ సుధీర్ఘ నోట్ షేర్ చేశారు. దీంతో సమంతపై అటు సెలబ్రెటీలు సైతం పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పుడు అలాంటి వివాదంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) పడింది. సమంతను విమర్శించిన అదే డాక్టర్ ఇప్పుడు నయన్ పై మండిపడుతున్నారు. అటు నయన్ కూడా గట్టిగానే కౌంటర్స్ ఇస్తుంది.

Nayanthara Comment

అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల నయన్(Nayanthara) తన ఇన్ స్టాలో మందార టీతో కలిగే ప్రయోజనాల గురించి చెబుతూ ఓ పోస్ట్ చేసింది. మందార టీలో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయని.. దీనిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను సమతౌల్యంగా ఉంచుతుందని తెలిపింది. అలాగే ఈ టీ సీజనల్ ఇన్ఫెక్షన్, అనారోగ్యం నుంచి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా డయాబెటిస్ నుంచి మొటిమల వరకు అనేక సమస్యలకు ఈ టీ పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుందంటూ చెప్పుకొచ్చింది. అలాగే మందార టీని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చెప్పుకొచ్చింది. దీంతో నయన్ తీరపై డాక్టర్ లివర్ డాక్ సీరియస్ అయ్యారు. మందార టీ కాస్త టేస్టీగా ఉంటుందని చెబితే పర్లేదు.. కానీ ఇలా అవగాహన లేని చిట్కాలు ఎందుకు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రజారోగ్యం పై సర్జికల్ స్ట్రైక్ లాగా సెలబ్రెటీలు అందరూ ఈ రకమైన ఉచిత ఆరోగ్య సలహాలు ఇవ్వకుండా కావాల్సిన చట్టాలు తీసుకురావాలని.. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోగ్యం గురించి సలహాలు ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. మందార పువ్వుపై ఆమె తనకున్న అవగాహనతో 8.7 మిలియన్ ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.

మందార టీ మధుమేహం, రక్తపోటు, మొటిమలకు మంచిదని.. యాంటీ బాక్టీరియల్ కలిగి ఉంటుందని అంటున్నారు.. కానీ అందుకు సంబంధించిన ప్రూవ్స్, మెడికల్ క్లైమ్స్ ఎక్కడ ధృవీకరించలేదని అన్నారు. దీంతో నయన్ తాను చేసిన మందార టీ పోస్టును తొలగించింది.. కానీ అందుకు క్షమాపణ కూడా చెప్పలేదని అన్నారు డాక్టర్ లివర్ డాక్. ఇదిలా ఉంటే.. డాక్టర్ లివర్ డాక్ పై పరొక్షంగా కౌంటరిచ్చింది నయన్(Nayanthara). ప్రముఖ రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన కోటేషన్ ను తన స్టోరీలో షేర్ చేసింది. “ మూర్ఖులతో ఎప్పుడూ వాదించకండి. వారు మిమ్మల్ని వారి స్థాయికి లాగి, ఆపై అనుభవంతో మిమ్మల్ని కొడతారు” అంటూ షేర్ చేసింది. అలాగే రిమూవ్ చేసిన మందార టీ రెసిపీని మళ్లీ పోస్ట్ చేసింది.

Also Read : Mahesh Babu-Raayan : ధనుష్ ‘రాయన్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన మహేష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com