David Warner : నితిన్ రెడ్డి, లవ్లీ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన చిత్రం రాబిన్ హుడ్. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు భారీ ఎత్తున స్పందన లభించింది. ప్రత్యేకించి తమిళ సినీ రంగానికి చెందిన నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. యూట్యూబ్ సాంగ్స్ లో టాప్ లో కొనసాగుతోంది రాబిన్ హుడ్ సాంగ్.
David Warner-Robinhood 1st Look Released
ఇదిలా ఉండగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు వెంకీ కుడుముల. ఈ మూవీకి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ క్రికెటర్ గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) రాబిన్ హుడ్ చిత్రంలో అతిథి పాత్రలో రానున్నాడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తను నటిస్తున్నాడని కన్ ఫర్మ్ చేశారు దర్శక, నిర్మాతలు. శనివారం రాబిన్ హుడ్ చిత్రానికి సంబంధించి వార్నర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ పరంగా తెలుగు వారికి అత్యంత ఆత్మీయుడిగా మారి పోయారు డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కెప్టెన్ గా ఆ జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ప్రస్తుతం క్రికెట్ పరంగా పేరు పొందాడు. తెలుగు సినిమాలంటే ముందు నుంచీ వార్నర్ కు ప్రేమ. ఎన్నో పాటలకు రీల్స్ కూడా చేశాడు. తనతో పాటు భార్య, కొడుకు కూడా ఈ పాటలకు రీల్స్ చేస్తూ మరింత దగ్గరయ్యాడు, సెన్సేషన్ గా మారాడు. దీనిని దృష్టిలో పెట్టుకుని డేవిడ్ వార్నర్ కు బిగ్ ఛాన్స్ దక్కింది ఈ మూవీలో.
Also Read : Hero Chiranjeevi Praises :పవన్ కళ్యాణ్ ప్రసంగం అద్భుతం