Dasari Sahithi: కంగనా రనౌత్, కుష్బూ సుందర్, నవనీత్ కౌర్, ఆర్ కే రోజా వంటి హీరోయిన్లు ఎన్నికల బరిలో పోటీపడుతున్న సంగతి తెలిసింది. తాజాగా ఆ లిస్ట్ లో మరో టాలీవుడ్ నటి చేరింది. ‘పొలిమేర’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Dasari Sahithi in Politics
‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాల్లో సాహితి(Dasari Sahithi) తన నటనతో ఆకట్టుకున్నారు. మొదటిభాగంలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్ లో రాజేశ్ తో కలిసి నటించారు. ఇటీవల తన ఇన్‌స్టా వేదికగా రాజకీయాల గురించి సాహితి స్పందించారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని చెప్పిన ఆమె… ఇన్‌స్టాలో తాను రీల్స్ చేసే పాటలకు పొలిటికల్ విషయాలను ఆపాదించొద్దని కోరారు. చేవేళ్ల నుంచి బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు. అయితే ఈమె అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read : R. Madhavan: అజయ్ దేవగణ్ పై మాధవన్ ప్రశంసల జల్లు !