Darshan Thoogudeepa: మర్డర్ కేసులో కన్నడ హీరో అరెస్టు !

మర్డర్ కేసులో కన్నడ హీరో అరెస్టు !

Hello Telugu - Darshan Thoogudeepa

Darshan Thoogudeepa: కన్నడ స్టార్ హీరో దర్శన్ ని మంగళవారం ఉదయం ఒక హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు ఫార్మ్ హౌస్ లో నటుడు దర్శన్ ఉండగా అతన్ని అరెస్టు చేసినట్టుగా సమాచారం. గత సంవత్సరం డిసెంబర్లో దర్శన్ నటించిన ‘కాటేరా’ అనే సినిమా విడుదలయింది, ఇది అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దర్శన్ కి పెళ్ళైనా కూడా పవిత్ర గౌడ అనే నటితో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు అని వార్తలు ఎన్నో వచ్చాయి.

Darshan Thoogudeepa….

ఇంతకీ దర్శన్ ని ఎందుకు అరెస్టు చేశారంటే రేణుక స్వామి హత్య విషయంలో దర్శన్ పాత్ర వున్నట్టుగా పోలీసుల అనుమానం. నటి పవిత్ర గౌడకి రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్ లు పంపుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా పవిత్రను భయపెట్టడం చేసేవాడు. ఈ నేపథ్యంలో పవిత్ర ఈ విషయం దర్శన్ కు చెప్పినట్లు సమాచారం. దీనితో దర్శన్(Darshan Thoogudeepa) రేణుక స్వామిని హత్య చేయించినట్లు గా పుకార్లు వస్తున్నాయి. రేణుక స్వామి శరీరం మైసూరు ప్రాంతంలో దొరికినప్పుడు ముందుగా అది ఆత్మహత్య అనుకున్నారు. అయితే లోతుగా విచారణ చేసిన తరువాత… అది హత్య అని తేలింది. దీనికి సంబంధించి పోలీసులు సుమారు పదిమందిని అరెస్టు చేసి విచారణ చెయ్యగా… అందరూ దర్శన్ వైపే వేలెత్తి చూపినట్టుగా తెలిసింది. దర్శన్ సుపారీ ఇచ్చి ఈ హత్యకి ప్లాన్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే దర్శన్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దర్శన్ అరెస్టుపై అతని కుటుంబ సభ్యులు ఇంకా ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.

Also Read : Surekha Vani: నటి సురేఖావాణితో బాలీవుడ్ వైరల్ స్టార్ హాట్ ఫొటోలు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com