Danush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ రెండేళ్ల క్రితం అనౌన్స్ చేశారు. తాజాగా వీరిద్దరూ విడాకులకు అప్లయ్ చేసినట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టును సంప్రదించి.. మ్యూచువల్ కన్సెంట్ కింద విడాకులు కోరినట్లు పలు వెబ్‌సైట్స్‌లో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Danush Divorse
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఐశ్వర్య పెద్ద కుమార్తె. చదువుకునే రోజుల్లో ధనుష్ వాళ్లక్క, ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు. దీనితో ఆమె తరచూ ధనుష్(Danush) వాళ్లింటికి వెళ్లి వస్తుండేవారు. అలా వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. వయసులో తనకంటే పెద్దదైన యువతిని ప్రేమించడం కరెక్టా?, కాదా? అని మొదట సందేహపడిన ధనుష్.. కొంతకాలానికి ఆమెతో ప్రేమను అధికారికంగా ప్రకటించాడు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని 2022లో అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ‘‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేనూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం’’ అని ధనుష్ పోస్ట్ పెట్టారు.
Also Read : Allu Arjun: అల్లు అర్జున్ కు మెగాస్టార్ స్పెషల్ విషెస్ !