Dadasaheb Phalke Film Festival: దాదా సాహేబ్ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో సత్తా చాటిన జవాన్, యానిమల్ సినిమాలు!

దాదా సాహేబ్ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో సత్తా చాటిన జవాన్, యానిమల్ సినిమాలు!

Hello Telugu - Dadasaheb Phalke Film Festival

Dadasaheb Phalke Film Festival: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (DPIFF)- 2024’ ను అట్టహాసంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ముంబయిలో నిర్వహించిన ఈ వేడుకకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన సినీతారలు విచ్చేసి సందడి చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌ లో విడుదలై బాక్సాఫీసు ఎదుట ఘన విజయం అందుకున్న ‘యానిమల్‌’ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా సందీప్‌ వంగా ఎంపికయ్యారు. అట్లీ దర్శకుడిగా తెరకెక్కిన జవాన్‌ సినిమాలో హీరోగా నటించిన షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా, నయనతార ఉత్తమ నటిగా నిలిచారు. దీనితో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన విజేతలకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

Dadasaheb Phalke Film Festival – డీపీఐఎఫ్‌ఎఫ్‌- 2024 విజేతలు వీరే…

ఉత్తమ నటుడు – షారూక్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి – నయనతార (జవాన్)
ఉత్తమ నటుడు (నెగెటివ్‌ రోల్‌)- బాబీ దేవోల్‌ (యానిమల్‌)
క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్‌ ( సామ్‌ బహదూర్‌)
ఉత్తమ దర్శకుడు- సందీప్ వంగా (యానిమల్‌)
ఉత్తమ గీత రచయిత – జావేద్‌ అక్తర్‌ ( నిక్లే ది కభి హమ్‌ ఘర్‌సే ధున్కీ)
ఉత్తమ సంగీత దర్శకుడు – అనిరుధ్‌ రవిచందర్‌
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ (Male) – వరుణ్‌ జైన్‌
ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ ( Female) – శిల్పా రావు
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ మ్యూజిక్‌ ఇండస్ట్రీ – యేసుదాసు
ఔట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ – మౌషుమీ ఛటర్జీ

టెలివిజన్‌ విభాగం

టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ది ఇయర్‌ – ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌
ఉత్తమ నటుడు – నెయిల్‌ భట్ (ఘమ్‌ హై కిసీకే ప్యార్‌ మెయిన్‌)
ఉత్తమ నటి – రూపాలీ గంగూలీ (అనుపమ)

వెబ్‌సిరీస్‌ విభాగం

క్రిటిక్స్‌ ఉత్తమ నటి – కరిష్మా తన్నా (స్కూప్‌)

Also Read : Trisha Krishnan: నటి త్రిషపై అన్నా-డిఎంకే పార్టీ నాయకుడి సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com