Daaku Maharaaj : తాను మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నానని, సంక్రాంతికి బిగ్ హిట్ ఇవ్వడం ఖాయమని అదే విషయం నిజమైందన్నారు డాకూ మహారాజ్ సినీ నిర్మాత నాగవంశీ. దర్శకుడు బాబీ తనదైన శైలిలో దుమ్ము రేపేలా తీశాడని, ఆద్యంతమూ సన్నివేశాలను మరింత బలంగా ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడని అన్నారు.
Daaku Maharaaj Movie Updates
తమ అంచనాలకు మించి భారీ ఆదరణ చూరగొందని, ప్రత్యేకించి నటుడు నందమూరి నట సింహం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కొందరు కావాలని బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ గురించి కావాలని దుష్ప్రచారం చేశారని వాపోయారు.
వాటన్నింటిని పక్కన పెట్టి ఫ్యాన్స్ ఊహించని రీతిలో భారీ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు నాగవంశీ.
బాలకృష్ణ సినీ కెరీర్ లో గొప్ప సినిమాగా డాకూ మహారాజ్ నిలిచి పోతుందన్నారు. తమన్ అందించిన సంగీతం, బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ సినిమాకే హైలెట్ గా నిలిచిందన్నారు నిర్మాత. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ గా నిలిచిందని , సూపర్ డూపర్ హిట్ గా రికార్డ్ బ్రేక్ చేసిందన్నారు నాగవంశీ. సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా నటించారు.
Also Read : Prasanth Varma Magic : హనుమాన్ సినిమాపై డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు