Daaku maharaaj : బాబీ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలయ్య ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా , శ్రద్దా శ్రీనాథ్ కలిసి నటించిన డాకు మహారాజ్ చిత్రం బిగ్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. శంకర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ , అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విక్టరీ వెంకటేశ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ , బుల్లిరాజు కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాంతో పాటు డాకు మహారాజ్ విడుదలైంది.
Daaku maharaaj Movie in OTT
ప్రజలను రక్షించే బందిపోటు పాత్ర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సినిమాను తెరకెక్కించాడు బాబీ. తను గతంలో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య తీశాడు. ఇది రికార్డ్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత బాలయ్యతో డాకు మహారాజ్ తీశాడు. ఇది ఊహించని రీతిలో సూపర్ సక్సెస్ అయ్యింది.
డాకు మహారాజ్ తో బాలయ్య మరోసారి తనదైన మార్క్ తో గట్టెక్కించేందుకు ప్రయత్నం చేశాడు. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో కలిసి చేసిన దబిడి దిబిడి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ. 105 కోట్ల గ్రాస్ సాధించింది డాకు మహారాజ్.
Also Read : Beauty Sai Pallavi : తీరని కలగా మిగిలిన జాతీయ అవార్డు