Ram Charan : జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సంచలనంగా మారారు. తను ప్రస్తుతం మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే టాటా ఐపీఎల్ కోసం చెన్నైకి చేరుకున్నాడు. ఈ సందర్భంగా కీలక అప్ డేట్ వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ(Ram Charan) కీలక పాత్రలో ఆర్సీ 16 సినిమా చేస్తున్నాడు. ఇందులో కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు.
Ram Charan – MS Dhoni Movie
ప్రస్తుతం కర్ణాటకలోని పలు ప్రాంతాలలో షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే క్రీడా నేపథ్యంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోందని , ఇందులో భాగంగా హీరో రామ్ చరణ్ తేజకు కోచ్ గా ఎవరు ఉండాలనే దానిపై మూవీ మేకర్స్ మల్లగుల్లాలు పడ్డారని సమాచారం. ఈ మేరకు కోచ్ గా భారత జట్టు స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని కన్ ఫర్మ్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చెర్రీ స్పోర్ట్స్ మన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఇద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ధోనీ కోచ్ గా కీలక పాత్ర లో నటించే విషయమై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు దర్శకుడు బుచ్చిబాబు సన. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా పూర్తి కాకుండానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సంస్థలు రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి.
Also Read : Popular Actress Annapurna : కమిట్మెంట్ పేరుతో హైలెట్ అవుతున్నారు