Court Notices to Animal Movie: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక, బాబీడియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్’. టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా గత ఏడాది డిసెంబరు 1న విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు రణ్ బీర్ కపూర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 900 కోట్లు వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. తండ్రీ-కొడుకుల సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉండగా యానిమల్ రన్‌టైమ్ మూడున్నర గంటలు ఉండటంతో ప్రేక్షకుల ఇబ్బంది పడుతారని భావించి సుమారు సుమారు తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేసినట్లు దర్శకుడు సందీప్ రెడ్డి గతంలో చెప్పాడు. థియేటర్ కోసం తొలగించిన ఆ తొమ్మిది నిమిషాల షాట్స్‌ను ఓటీటీ వెర్షన్‌కు యాడ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందులో రష్మికతో రణ్‌బీర్ లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో ‘యానిమల్(Animal)’ ఓటీటీ వెర్షన్ కోసం సినీ ప్రియులు మరింత క్రేజీగా ఎదురుచూస్తున్నారు. దీనితో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులుగా ఉన్న సినీ స్టూడియోస్… శాటిలైట్ రైట్స్ విషయంలో కోర్టును ఆశ్రయించడంతో ఓటీటీ రిలీజ్ కు చిక్కులు వస్తున్నట్లు తెలుస్తోంది.
Court Notices to Animal Movie – ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌కు చిక్కులు ?
‘యానిమల్’ సినిమాను టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. అయితే ఇందులో సినీ1 స్టూడియోస్ ‘యానిమల్(Animal)’ ఓటీటీ రిలీజ్‌ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే… వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీనితో సినీ1 స్టూడియోస్ వేసిన పరువు నష్టం దావా కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు… నెట్‌ఫ్లిక్స్ తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఈ అంశంపై జనవరి20 వివరణ ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్ తో పాటు టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ ల యాజమాన్యాన్ని న్యాయస్థానం కోరింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. శాటిలైట్ హక్కుల విషయంలో సినీ1 స్టూడియోస్ కోర్టును ఆశ్రయించడంతో ఓటీటీ రిలీజ్ పై సందేహాలు నెలకొంటున్నాయి.
Also Read : Ravi Teja: న్యాయం కోసం ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించిన ‘ఈగల్’ టీమ్ !