Dhanush : ధనుష్ ఐశ్వర్యల కేసుపై చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు

దువుకునే రోజుల్లో ధనుష్‌ వాళ్లక్క, ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు...

Hello Telugu - Dhanush

Dhanush : ఇటీవల విడాకుల కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్‌(Dhanush), ఆయన భార్య ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టు ఎదుట హాజరైన విషయం తెలిసిందే. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలని నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి వారు తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది తీర్పును ఈనెల 27కు వాయిద వేయగా, తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది.

Dhanush – Aishwarya Divorce..

ధనుష్‌,ఐశ్వర్యలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు జరిగినా వారి వైఖరిలో మార్పు రాకపోవడంతో ఎట్టకేలకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. తలైవా రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్‌(Dhanush) కంటే ఐశ్వర్య పెద్దదనే విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ధనుష్‌ వాళ్లక్క, ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు. అలా, వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్‌ 18న వీరి వివాహం జరిగింది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నాం అని రెండేళ్ల క్రితం ధనుష్‌ – ఐశ్వర్య ప్రకటించారు. పరస్పర అంగీకారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్టోనే చెప్పారు.

‘‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్థమయ్యాం. ఐశ్వర్య, నేనూ విడిపోవా?ని నిర్ణయం తీసుకున్నాం’’ అని 2022లో ధనుష్‌ పోస్ట్‌ పెట్టారు. విడాకుల కోసం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా.. వీరిద్దరూ హాజరుకాలేదు. దీంతో వీరిద్దరూ తిరిగి కలుస్తారని అభిమానులు భావించారు. కానీ, కోర్ట్ తీర్పుతో ఇక వారు కలవరని నిరాశకు గురవుతున్నారు.

Also Read : Allu Arjun-Pushpa 2 : బన్నీకి ఓ పెద్ద టాస్క్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com