Mohanlal: అగ్ర నటుడు మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం‘బరోజ్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ఇబ్బందులు తలెత్తాయి. తాను రాసుకున్న నవలను ఆధారంగా చేసుకునే ఈ సినిమా తెరకెక్కించారంటూ ప్రముఖ మలయాళీ రచయిత జార్జ్ తుండిపరంబిల్ చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించారు.
Mohanlal Movie..
మలయాళీ రచయిత జార్జ్… 2008లో ‘మాయ’ అనే పుస్తకాన్ని రచించారు. కప్పిరి ముత్తప్పన్ గురించి దీనిలో ప్రస్తావించారు. ‘‘ఈ నవల నచ్చడంతో దీని కాపీని మోహన్‌లాల్(Mohanlal) కు సన్నిహితుడైన సినీ రచయిత టీకే రవికుమార్ కు నా స్నేహితుడు గతంలో అందించాడు. రవికుమార్ దీనిని ఆధారంగా చేసుకుని సినిమా చేయాలనుకుంటున్నాడని… అందుకు తగిన వర్క్ మొదలైందని నా స్నేహితుడు చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ సినిమా విషయమై నన్ను ఎవరూ కలవలేదు. నా బుక్‌లో రాసిన ‘మాయ’ అనే పాత్రను ఆధారంగా చేసుకునే ఈ సినిమా సిద్ధమైందని సన్నిహితుల ద్వారా తెలిసింది’’ అని జార్జ్ తెలిపారు. తన కథను వాడుకున్నందుకు గాను మూవీ రిలీజ్‌కు ముందే పరిహారం చెల్లించాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు.
భారతీయ చిత్రసీమలో గొప్పనటుల్లో మోహన్ లాల్ ఒకరు. తొలిసారి ఆయన మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బరోజ్’. మైథలాజికల్ థ్రిల్లర్ గా ఇది సిద్ధమవుతోంది. బరోజ్ పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 12న ఇది విడుదల కానుంది.
Also Read : Sanjay Dutt: ముంబై వేదికగా ‘డబుల్ ఇస్మార్ట్’ నుండి బిగ్ బుల్ సాంగ్ రిలీజ్ !