Pushpa 2 : పాన్ ఇండియా స్థాయిలో ఓ బ్రాండ్‌గా మారిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప–2 చిత్రం గురువారం భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కొందరు సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా దాని ప్రభావం అంతగా పడకపోవచ్చు. అంతగా ఈ చిత్రం జనాల్లోకి దూసుకుపోయింది. పుష్ప రాజ్ పాత్ర తీరు, గంగమ్మ జాతర ఎపిసోడ్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. బన్నీలోని పూర్తి మాస్ యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు సుక్కూ. అయితే కొన్ని ప్రశ్నలు మాత్రం ప్రేక్షకుల మదిలో మెదులుతున్నాయి.
Pushpa 2 Missing Scenes..
‘వేర్‌ఈజ్ పుష్ప’ పేరుతో ‘పుష్ప 2(Pushpa 2)’ను ప్రకటించారు. దానికి సంబంధించి ఓ వీడియో గ్లింప్స్ అప్పట్లో విడుదల చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ‘పోలీస్ డౌన్ డౌన్’ అంటూ ప్రజలు నినాదాలు చేయడం, తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్నాడని వార్తల్లో రావడం చూపించారు సుకుమార్. పోలీసులు పుష్ప మీద పది రౌండ్లు కాల్పులు జరిపారని అందులో ఓ డైలాగ్ కూడా ఉంది. అన్ని గాయాలతో మనిషి అసలు బ్రతికే అవకాశం లేదని కొందరు న్యూస్ ఛానల్స్‌లో డిబేట్లు పెట్టారు, శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ కూడా సినిమాలో కనిపించలేదు. ఆ తర్వాత ఓ అడవిలో పుష్ప కనిపిస్తాడు.
‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయి అంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం’ అని ఆ అనౌన్స్‌మెంట్ వీడియో చివరలో డైలాగ్ ఉంటుంది. అసలు ఆ సీన్ ‘పుష్ప 2(Pushpa 2)’లో లేదు. ఎడిటింగ్‌లో తీసేశారా? లేదా పార్ట్ –3లో చూపిస్తారా? అని నెటిజన్లు సుక్కూని ప్రశ్నిస్తున్నారు. ‘పుష్ప 2(Pushpa 2)’ చూసిన జనాలకు ఇప్పుడు చెప్పే సీన్ బాగా అర్థం అవుతుంది. జపాన్ పోర్టులో హీరో ఇంట్రడక్షన్ తీశారు సుకుమార్. తన సరుకు ఎక్కడకు వెళుతుందో తెలుసుకోవడం కోసం కంటైనర్‌లో జపాన్ వచ్చానని, 40 రోజులు ఖాళీగా ఉండటం ఎందుకు అని 30 రోజుల్లో జపాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నానని చెబుతాడు. తనకు రావలసిన డబ్బు ఇవ్వాల్సిందిగా అక్కడ పెద్ద యుద్ధమే చేస్తాడు.
ఆ తర్వాత అసలు జపాన్ మాటే వినిపించదు. ‘పుష్ప 2(Pushpa 2)’ ట్రైలర్ చూస్తే… కరెక్టుగా 1.35 సెకన్స్ దగ్గర జపాన్‌లో ఓ రెస్టారెంట్‌లో అల్లు అర్జున్ ఎవరితోనో డీల్ మాట్లాడుతున్నట్లు చూపించారు. ఆ సీన్ కూడా ఇప్పుడు సినిమాలో లేదు. జపాన్ రెస్టారెంట్ సన్నివేశానికి ముందు ట్రైలర్‌లో జాలి రెడ్డి కూడా కనిపిస్తారు. ఎవరికో గన్ గురి పెడతారు. ఆ సీన్ కూడా ‘పుష్ప 2’లో లేదు. ఎండింగ్ టైటిల్ కార్డ్స్‌లో అందరూ వచ్చారు.. అసలోడు ఎక్కడ అనగానే వస్తాడు జాలి రెడ్డి. పార్ట్ 3లో ఆయన క్యారెక్టర్ కీలకం కానుందేమో అనిపిస్తుంది.
సినిమాలో ఉన్నట్టుండి శివ మాట ఎందుకు వేశాడు? అరే దీవానో అనే పాట వింటూ భన్వర్ సింగ్ షెకావత్ నదిలో స్నానం చేేసే సీన్ కూడా తెరపై చూపించలేదు. అది కూడా పార్ట్ 3లో ఉంటుందా? అలాగే క్లైమాక్స్‌లో కోట ఫైట్‌తో పీక్స్‌కు తీసుకెళ్లి తర్వాత ఫ్యామిలీ బాండింగ్ యాడ్ చేసి సింపుల్ చేసేశారు. దాంతో పుష్ఫ–3కి సరైన లీడ్ ఇచ్చినట్లు లేదు. ఎర్రచందనం గౌడౌన్‌లో బ్లాస్ట్ తర్వాత షెకావత్, బ్రహ్మాజీ పాత్రలు కనిపించవు. ఆ బ్లాస్ట్ తర్వాత ఏమైంది? అనేది మరో క్వశ్చన్. పుష్ప అన్న కూతురు పెళ్లి తర్వాత జరిగిన బ్లాస్ట్ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనేది మరొక ప్రశ్న. వీటన్నింటికి లెక్కల మాస్టర్ పుష్ప–3లో చూపిస్తారా? అయితే మరో మూడేళ్ల వేచి చూడాల్సిందే!
Also Read : Nandamuri Mokshagna : మరోసారి వాయిదా పడ్డ మోక్షజ్ఞ అరంగేట్రం