Ari Movie: ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ దర్శకత్వంలో సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న సినిమా ‘అరి’. వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ తో ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ‘అరిషడ్వర్గాలు వర్సెస్ శ్రీకృష్ణుడు అనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చెబుతున్నారు.
అంటే మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు ? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో రిలీజ్ కు ముందే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ వార్తలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
Ari Movie Updates
‘అయలాన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan)… ‘అరి’ ట్రైలర్ చూసి, దర్శకుడిని జయ శంకర్‌ను మెచ్చుకున్నారు. అంతేకాదు, సినిమాను ప్రత్యేకంగా చూశారట. ఇందులోని కృష్ణుడి పాత్ర తనకెంతో నచ్చిందని, ఒకవేళ రీమేక్ చేస్తే ఆ పాత్రలో తాను నటిస్తానని జయశంకర్‌తో అన్నారట. అలాగే బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో ఈ మూవీ రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందే రీమేక్ కోసం పోటీపడుతున్న సినిమాగా ‘అరి’ రికార్డు సృష్టిస్తోంది.
Also Read : Rakul Preet Singh: అల్లు అరవింద్ ‘రామాయణం’ లో శూర్పణఖగా రకుల్ ?