Prudhvi Raj : ఇటీవలే ఆస్పత్రి పాలై బయటకు వచ్చిన కమెడియన్ పృథ్వీ రాజ్(Prudhvi Raj) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ కించ పర్చాలని కామెంట్స్ చేయలేదన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరి పట్ల ద్వేషం లేదన్నారు. నా వల్ల సినిమాకు నష్టం రాకూడదనే నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
Prudhvi Raj Shocking Comments
సినిమా రంగం అందరినీ ఆదరిస్తుందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవన్నారు. కానీ కొందరు కావాలని తనను పనిగట్టుకుని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్.
ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే తాను సారీ చెబుతున్నానని అన్నారు. ఇప్పటికైనా ట్రోలింగ్ కు పుల్ స్టాప్ పెట్టాలని కోరాడు. బాయ్ కాట్ లైలా అని కాకుండా వెల్ కమ్ లైలా అని మార్చేయాలని విన్నవించాడు.
ఇదిలా ఉండగా ఇటీవల విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు కమెడియన్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెలన్నీ ఎక్కడికో వెళ్లి పోయాయని, కానీ కేవలం 11 గొర్రెలు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ చెప్పాడు.
ఇది పూర్తిగా ఏపీలో వైసీపీ గురించి ఉద్దేశించి కామెంట్స్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఏకి పారేశారు. దీంతో పృథ్వీ రాజ్ ఆస్పత్రి పాలయ్యాడు. చివరకు బయటకు వచ్చాడు.
Also Read : Manchu Manoj Shocking :బడ్జెట్ కంటే సినిమాలో దమ్ముండాలి