Comedian Neel Nanda: ప్రముఖ హాలీవుడ్ స్టాండప్‌ కమెడియన్‌ మృతి

ప్రముఖ హాలీవుడ్ స్టాండప్‌ కమెడియన్‌ మృతి

Hello Telugu - Comedian Neel Nanda

Comedian Neel Nanda: భారత సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్‌ స్టాండప్‌ కమెడియన్‌ నీల్‌ నందా(32) మృతి చెందారు. నీల్ నందా అతి చిన్న వయసులో మృతి చెందినప్పటికీ… మృతికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. ఆయనకు మేనేజర్ గా వ్యవహరిస్తున్న గ్రేగ్ వీస్ అధికారికంగా ద్రువీకరించారు. కాకపోతే అతనిది సహజ మరణమా, ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయం మాత్రం ఇంతవరకు కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు. నీల్ నందా చిన్నవయసులో చనిపోవడంతో హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. నీల్ నందా కమెడియన్ గానే కాకుండా మంచి రచయిత. జిమ్మీ కిమ్మెల్, కామెడీ సెంట్రల్ ఆడమ్ డివైన్స్ హౌజ్ పార్టీ వంటి షో, వైస్ ల్యాండ్, హులు అనే కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లాస్‌ ఏంజెలీస్‌ లోని వెస్ట్‌సైడ్‌ కామెడీ థియేటర్‌లో ‘అన్‌నెసెసరి ఈవిల్‌’ అనే వీక్లీ షోకు యాంకర్ గా వ్యవహరించారు నీల్.

Comedian Neel Nanda No More

నీల్ నందా మృతి పట్ల ప్రముఖ కామెడీ క్లబ్స్‌, జోకర్‌ థియేటర్‌ సంతాపం తెలిపాయి. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న నీల్ నందా ఇంత చిన్న వయసులో చనిపోవండం దిగ్భ్రాంతికి గురిచేసిందని… అతను గొప్ప కామిక్ అంటూ గ్రేగ్ వీస్ ఆవేదన వ్యక్తం చేశారు. నీల్ నందా(Neel Nanda) మరణ వార్త విని షాక్ కి గురయ్యాను.. కష్టపడి పనిచేసేవారిలో ఆయన ఒకరు అంటూ అమెరికన్ నటుడు మాట్ రైఫ్ అన్నారు. భారత సంతతికి చెందిన నీల్ నందా… 2013లో ప్రముఖ షో జిమ్మీ కమ్మెల్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించారు.

అతి తక్కువ కాలంలోనే తనదైన పర్ఫామెన్స్ తో అందరి మనసు దోచాడు. నీల్ నందా ఎక్కువగా అట్లాంటాలోనే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. నీల్ నందా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్ సైడ్ జోక్స్, హులు కమింగ్ టూ ది స్టేజ్ లో కూడా కనిపించి అందరినీ నవ్వించారు. ‘కామెడీ సెంట్రల్‌ అనే టీవీ ఛానల్‌ని చూస్తూ ఉండటంతో చిన్నతనం నుంచే హాస్యం పండించడంపై నీల్‌కి మక్కువ పెరిగింది. ఆ ఛానల్‌లో వచ్చే జోక్స్‌ను మరుసటి రోజు పాఠశాలలో అందరికీ చెప్తు నవ్వించేవారు. నీల్ నందా మరణ వార్త సోషల్ మీడియాలో వ్యాపించగానే… సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

Also Read : Fighter Movie: ‘ఫైటర్’ నుండి కొత్త పోస్టర్ విడుదల !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com