CM Revanth Reddy : రాజులు ఏ రంగంలో అడుగుపెట్టిన అక్కడ ఖచ్చితంగా రాణిస్తారని.. నిబద్ధతతో పనిచేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణంరాజు, ప్రభాస్, రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy Comment
కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేమని, మొట్టమొదటి సారిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సత్తా చాటిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అని తనకు మంచి మిత్రుడని, అదేవిధంగా బాలీవుడ్‌ను దాటి మన టాలీవుడ్ హాలీవుడ్‌తో పోటీ పడి రాణించడిన చిత్రం బాహుబలి. అందుకు కారణం ప్రభాస్. తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన ఈ సినిమాలో ప్రభాస్ లేకుండా బాహుబలి పాత్రను ఊహించలేమని రేవంత్ రెడ్డి అన్నారు. వీటన్నింటికీ, వారు రాణించడానికి ప్రధాన కారణం, వారి కఠోర శ్రమ, కష్టపడేతత్వమేనని సిఎం రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.
Also Read : Keerthy Suresh : తన రాజకీయ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చిన మహానటి