Cricketer Trisha- 1Cr Prize :క్రికెట‌ర్ త్రిష‌కు రూ. కోటి బ‌హుమానం

ప్ర‌క‌టించిన తెలంగాణ సీఎం

Hello Telugu - Cricketer Trisha- 1Cr Prize

Cricketer Trisha : హైద‌రాబాద్ – మ‌లేషియా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో స‌త్తా చాటిన తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష‌కు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. త‌న నివాసంలో త్రిష మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌పంచ క‌ప్ లో అద్భుతంగా ఆడావని, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకు వ‌చ్చామ‌ని ప్ర‌శంసించారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) త్రిష‌ను. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం త‌ర‌పున రూ. కోటి రూపాయ‌లు బ‌హుమానంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Cricketer Trisha Got 1cr Prize

త‌న‌కు న‌జ‌రానా ప్ర‌క‌టించినందుకు ఉబ్బి త‌బ్బిబ్బ‌యింది గొంగిడి త్రిష‌. త‌న‌కు కోటి ఇస్తున్నందుకు సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో టాప్ లో నిలిచింది. అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ గా ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికైంది. అంతే కాదు ఫైన‌ల్ మ్యాచ్ లో 3 వికెట్లు ప‌డ‌గొట్టింది. ఏకంగా 44 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. భార‌త జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ ను చేజిక్కించు కోవ‌డంలో కీల‌క పాత్ర పోషించింది గొంగిడి త్రిష‌.

ఈ సంద‌ర్భంగా ఆమెను దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ కుమార్ తో పాటు మాజీ క్రికెట్ కెప్టెన్ స‌చిన్ టెండూల్క‌ర్ , బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా అభినందించారు.

Also Read : Hero PK- A M Rathnam :ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా స‌క్సెస్ ప‌క్కా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com