CM Chandrababu : అమరావతి – సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నీటి ప్రాజెక్టుల పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. జాప్యం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. .పనులు వేగవంతం చేయాలని…వచ్చే సమీక్ష నాటికి ప్రోగ్రెస్ కనిపించాలని స్పష్టం చేశారు.
CM Chandrababu Sensational Comments
పోలవరం కాలువల సామర్థ్యం విషయంలో మొదట ఎంత సామర్థంతో(17500 క్యూసెక్కులు) అయితే డిజైన్ చేశారో..అంత సామర్థ్యం మేర నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సూచించారు. అనుమతులు, నిధులు ఉన్నప్పటికీ ఎందుకు పనులు సాగడం లేదని నిలదీశారు. ఏ కారణాల చేత అయినా 2027 జూన్ నాటిక పనులు పూర్తి కాకపోతే…. 2027 డిసెంబర్‌కు ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు విశాఖకు తీసుకువెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావాలన్నారు. తద్వారా గోదావరి నీళ్లను ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మళ్లించే అవకాశం లభిస్తుందన్నారు.
చింతలపూడి లిఫ్ట్ పనులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి పనులు గాడిన పెట్టాలని సిఎం సూచించారు. వెలిగొండ విషయంలో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్టు నేటికీ పూర్తికాక పోవడం బాధాకరమన్నారు చంద్రబాబు నాయుడు.
Also Read : Manipur- Shocking :మణిపూర్ లో ప్రెసిడెంట్ పాలన