Shrasti Varma : బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే నటి లావణ్య తనను కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశాడంటూ ఆరోపించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తనపై ఫిర్యాదు చేసింది.
Shrasti Varma Shocking Comments on Bigg Boss
ఈ తరుణంలో ఉన్నట్టుండి మరో కేసు నమదైంది బాషాపై. తను ఎవరో కాదు..ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఆరోపణలు చేసిన లేడి కొరియా గ్రాఫర్ శ్రేష్టి వర్మ(Shrasti Varma) శేఖర్ బాషాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై సంచలన కామెంట్స్ చేసింది.
జానీ మాస్టర్ కేసు ప్రస్తుతం నడుస్తోందని, ఇందుకు సంబంధించి విచారణ జరుగుతుండగా తన కాల్ ను దొంగతనంగా రికార్డ్ చేశాడంటూ శేఖర్ బాషాపై ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా కొన్ని ప్రసార మాధ్యమాలలో, యూట్యాబ్ ఛానల్స్ లలో తన గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటూ వాపోయింది శ్రేష్టి వర్మ.
ఉద్దేశ పూర్వకంగానే తనను బద్నాం చేసి, ఇబ్బందులు పెట్టేందుకు శేఖర్ బాషా ప్రయత్నం చేశాడని కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో నార్సింగి పోలీసులు బిగ్ బాస్ ఫేమ్ పై మరో కేసు నమోదు చేశారు.
Also Read : Beauty Priyanka Jain :కుంభ మేళాలో తళుక్కుమన్న తార