Choreographer Bosco Martis: మెగాస్టార్ చిరంజీవి తరువాత టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు బాగా వినిపిస్తాయి. మెగా ఫ్యామిలీకు చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్ మాట ఎలాగున్నా… డ్యాన్స్ లో ఎన్టీఆర్ కు ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. కూచిపూడితో పాటు ఏ జానర్ పాటకైనా అదిరిపోయే స్టెప్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు కొరియోగ్రాఫర్స్ కు ఒక సవాల్ గా నిలుస్తాడు తారక్. ప్రస్తుతం తారక్… స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్(Bosco Martis) కొరియోగ్రఫీ చేయనుండగా… తాజాగా తారక్ కు డ్యాన్స్ కంపోజ్ చేసే విషయమై బోస్కో మార్టిస్ తన ఎగ్జయిటింగ్ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను తెలియజేశారు.
Choreographer Bosco Martis….
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పాట చిత్రీకరణ నిమిత్తం ఇటీవలే టీమ్ థాయిలాండ్ వెళ్లింది. అయితే ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్(Bosco Martis) కొరియోగ్రఫీ చేయనుండగా.. తాజాగా తారక్‌కు డ్యాన్స్ కంపోజ్ చేసే విషయమై బోస్కో మార్టిస్ తన ఎగ్జయిటింగ్ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను తెలియజేశారు. ‘పఠాన్, వార్, ఫైటర్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన స్టెప్స్‌ను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్‌గా బాస్కో మార్టిస్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి పని చేస్తుండటంపై బాస్కో ఎగ్జయిట్ అయ్యారు. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేయటం ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాస్కో షేర్ చేసిన ఈ ఫొటోలో ఫ్రెష్ లుక్ తో ఉన్న ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా డ్యాన్స్ లో ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభను బాస్కో కొనియాడారు. ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి స్టార్‌కు బాస్కో మార్టిస్(Bosco Martis) నృత్యరీతులను కంపోజ్ చేయటమనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతోంది.
రీసెంట్ గా ‘ఫియర్ సాంగ్’ను రిలీజ్ చేయటం ద్వారా ఫిల్మ్ మేకర్స్ ‘దేవర’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ పాట సోషల్ మీడియా ద్వారా గ్లోబల్ రేంజ్ సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్, హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Also Read : Kalki 2898 AD Update : రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తున్న కల్కి