Vikram : తమిళ చలన చిత్ర సీమలో అగ్ర నటుడు చియాన్ విక్రమ్(Vikram) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం కథ నచ్చితే చాలు ఓకే చెప్పేసి సినిమాలు చేసుకుంటూ పోవడం తన నైజం. సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు పా రంజిత్ తీసిన తంగలాన్ లో నటించిన విక్రమ్ ఫుల్ మార్కులు కొట్టేశాడు. భారత దేశ సినీ చరిత్రలో ఈ చిత్రం సంచలనం సృష్టించింది. పా టేకింగ్ మేకింగ్ కు సినీ క్రిటిక్స్ విస్తు పోయారు. అద్భుతమైన దర్శకుడు అంటూ కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో చియాన్ అందులో లీనమై పోయాడు. కోట్లాది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.
Vikram Comment about Telugu Movie
ఇక తంగలాన్ తర్వాత చియాన్(Chiyaan) నటిస్తున్న మరో చిత్రం వీర ధీర శూరన్ . ఎస్ యు అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. హెచ్ ఆర్ పిక్చర్స్ పై రియా శిబు నిర్మిస్తోంది. మూవీ మేకర్స్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని స్పష్టం చేశారు. ఇక సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో సందడి చేశారు చియాన్ విక్రమ్.
చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు. తనకు స్ట్రెయిట్ గా టాలీవుడ్ లో సినిమా చేయాలని ఉందన్నాడు. తన మనసుకు నచ్చిన, మంచి కథ ఇంకా దొరకడం లేదన్నాడు. చాలా మంది తనతో మూవీస్ చేయాలని సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారంటూ చెప్పాడు. అయితే ఆచి తూచి అడుగులు వేయడం తనకు అలవాటు అని పేర్కొన్నాడు చియాన్. ప్రస్తుతం ఇండియన్ మూవీ ట్రెండ్ మారిందన్నాడు. ప్రతి చిత్రం పాన్ ఇండియా గా వస్తోందన్నాడు. దీంతో అన్ని భాషల్లోకి వస్తుండడంతో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ చేసేందుకు ఆస్కారం దొరకడం లేదన్నాడు విక్రమ్. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Also Read : Hero Prithviraj Sukumaran :సుకుమారన్ కామెంట్స్ సెన్సేషన్