Thangalaan OTT : ఓటీటీ కి సిద్ధమైన చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ సినిమా

బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం...

Hello Telugu - Thangalaan OTT

Thangalaan : సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా తంగలాన్(Thangalaan). ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా నేరుగా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.ఇన్నాళ్లు కోర్టు కేసులు, ఓటీటీతో నిర్మాణ సంస్థకు ఉన్న విభేధాల కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు అనుహ్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా మంగళవారం ఉదయం విడుదలయ్యింది. గత నెలలో ఈ సినిమా రిలీజ్ కు కోర్టు సైతం క్లియరెన్స్ ఇవ్వడంతో ఓటీటీ రిలీజ్ కు అడ్డంకి తొలగిపోయింది. డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

Thangalaan Movie OTT Updates

బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. ఇందులో పార్వతి తిరువోతు కథానాయికగా నటించగా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది హీరోయిన్ మాళవిక మోహనన్. ఈ చిత్రంలో విక్రమ్ లుక్, యాక్టింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్ హైలెట్ అయ్యింది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కథ విషయానికి వస్తే.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటమే తంగలాన్(Thangalaan). వారి పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీగా రూపొందించాడు డైరెక్టర్ పా రంజిత్. అడవిలో ఉండే బంగారు నిధిని వెలికితీయడానికి తంగలాన్ (విక్రమ్) వెళతాడు. కానీ ఆ నిధికి ఆరతి (మాళవికా మోహనన్ ) రక్షణగా ఉంటుంది. అసలు ఆరతి ఎవరు ? నిధి కోసం వెళ్లిన తంగలాన్ బృందం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది.. ? అనేది ఈ కథ. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Mohan Babu : మంచు మనోజ్ పై ఫిర్యాదు చేసిన తండ్రి మోహన్ బాబు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com