Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటించిన చిత్రం విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కు మంచి ఆదరణ లభించింది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వంభర నుంచి రామ రామ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. రిలీజ్ అయిన క్షణాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. వైరల్ గా మారింది. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేశ వ్యాప్తంగా మెగాస్టార్ కు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతకు మించిన స్టార్ ఇమేజ్ ఉంది.
Vishwambhara Rama Rama 1st Single Viral
అంతే కాదు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు కావడం విశేషం. తన సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ అపర భక్తుడు. ఆయన కొండగట్టు అంజన్నను కొలుస్తాడు. ఇదే సమయంలో మెగాస్టార్ నటించిన విశ్వంభరపై(Vishwambhara) భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి రస ప్రదర్శనలో అద్భుతంగా ఆకట్టుకునేలా నటించాడు. సినిమా నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ తాజాగా ప్రోమోను షేర్ చేసింది ఎక్స్ వేదికగా. ఈ హనుమాన్ జయంతి, రామ దూతలుగా మారి శ్రీరాముని మహిమను జరుపుకుందాం అంటూ పిలుపునిచ్చారు.
విశ్వంభర సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ సంగీత అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. సరస్వతీ పుత్రుడు రామ జోగయ్య శాస్త్రి రామ రామ పాటను రాశారు. శంకర్ మహదేవన్ దీనిని హృద్యంగా పాడారు. కొరియోగ్రఫీని విశ్వం దాటి చేశారు. మొత్తంగా ఈ సాంగ్ హనుమాన్ భక్తులను ఆకట్టుకునేలా సాగింది.
Also Read : Hero Vijay Sethupathi-Puri :పూరి విజయ్ సేతుపతి మూవీలో టబు