Vishwambhara : యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వశిష్ట ప్రతిష్టాత్మకంగా తరెకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వం వహించిన వాల్తేర్ వీరయ్య తర్వాత వచ్చిన ఆచార్య కొంత నిరాశను కలిగించింది. అయినా ఎక్కడా తన స్టామినా, స్టార్ డమ్ తగ్గలేదు చిరులో. ప్రస్తుతం విశ్వంభర(Vishwambhara) షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఓ వైపు ఈవెంట్స్ లకు హాజరవుతూనే మరో వైపు సినిమాలో బిజీగా ఉన్నారు.
Vishwambhara Movie 1st Single
ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసే అరుదైన నటులలో ఒకడు మెగాస్టార్. దర్శకుడు ఎవరైనా సరే చెప్పిన టైంకు వెళ్లడం, తనకు ఇచ్చిన పాత్ర గురించి ఒకటికి పదిసార్లు నెమరు వేసుకోవడం, టేక్ చెప్పేంత దాకా ఎన్నిసార్లైనా సరే బాగా వచ్చేంత దాకా నటించడం తన హాబీగా మార్చుకున్నాడు. అందుకే సక్సెస్ తను వద్దన్నా వెంటపడి వస్తోంది.
మెగాస్టార్ సరసన గతంలో పలు చిత్రాలలో నటించి మెప్పించిన త్రిష కృష్ణన్ ఈ విశ్వంభరలో ఫీ మేల్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ ను భిన్నంగా ఇందులో చూపించనున్నట్లు టాక్. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ఆడియో పనులపై కూడా దృష్టి సారించాడు మూవీ మేకర్స్.
ఈ చిత్రానికి స్పెషల్ గా మ్యూజిక్ ఇస్తున్నారు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి. మహా శివ రాత్రికి విశ్వంభర ఫస్ట్ సింగిల్ రానుందని సినీ వర్గాల సమాచారం. మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు చిరంజీవి కోసం.
Also Read : Beauty Pooja Hegde : లక్ కాదు టాలెంట్ వల్లే సినిమాల్లో ఛాన్స్