Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన లండన్ టూర్ లో ఉన్నారు. ఈ సందర్బంగా యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ ఆధ్వర్యంలో అత్యున్నతమైన పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ (జీవిత సాఫల్య పురస్కారం) ను ఎంపీల సాక్షిగా అందుకున్నారు. ఈ సందర్బంగా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో ఇంత స్థాయికి వస్తానని ఏనాడూ అనుకోలేదన్నారు. తన కెరీర్ లో ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచేలా చేసిందన్నారు.
Chiranjeevi Emotional about Fans meeting Collections
ఇదిలా ఉండగా తన లండన్ పర్యటన సందర్భంగా కొందరు అభిమానుల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలియడంతో అవాక్కయ్యారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఈ సందర్బంగా సామాజిక వేదిక ఎక్స్ ద్వారా తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. తాను ఎవరికీ డబ్బులు వసూలు చేయమని చెప్పలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని తాను ప్రోత్సహించనని పేర్కొన్నారు.
ముఖ్యంగా తనను, తన ఫ్యామిలీని ప్రేమించే వారు, అభిమానించే వారెవరూ ఇలాంటి చిల్లర మల్లర పనులు చేయరని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. తనను కలిసేందుకు ఎవరూ కూడా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు. ఎవరైనా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి ఉంటే వెంటనే తిరిగి వారికి ఇవ్వాలని అన్నారు. అభిమానాన్ని ఎవరూ కొనలేరని ఈ సందర్బంగా పేర్కొన్నారు చిరంజీవి.
Also Read : Vishnu Priya Shocking : పోలీసు విచారణలో విష్ణు ప్రియ