Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ కలిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). రోజు రోజుకు వయసు పెరుగుతున్నా ఎక్కడా తగ్గడం లేదు. కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ ముందుకు సాగుతున్నారు. సినీ దర్శక, నిర్మాతలకు మరింత జోష్ పెంచేలా చేస్తున్నారు. తను ఇప్పుడు విశ్వంభర చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో మోస్ట్ పాపులర్ , మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడితో తదుపరి చిత్రం చేయబోతున్నారు.
Chiranjeevi-Anil Ravipudi Movie Updates
ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయ్యిందని ఇటీవలే దర్శకుడు ప్రకటించాడు. దీనిని కూడా కన్ ఫర్మ్ చేశారు చిరంజీవి. ఇక నటనలోనే కాదు కామెడీని పండించడంలో, డ్యాన్సులతో ఇరగ దీయడంలో రాబోయే కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే చిరంజీవితో నటించేందుకు హీరోయిన్స్ కూడా కన్ ఫర్మ్ అయినట్లు టాక్. మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు ఆయనకు తోడుగా హైదరీ, భూమిక చావ్లా నటించనున్నారు.
ఇప్పటికే అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. కళ్యాణ్ రామ్ తో పటాస్, రవితేజ, మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ , బాలకృష్ణతో తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇదే సమయంలో తాజాగా సంక్రాంతి సందర్బంగా రిలీజ్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది.
Also Read : Dragon Movie Sensational :డ్రాగన్ లవర్స్ కు ఖుష్ కబర్