Chhaava : లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఛావా. హిందీ చలన చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని రీతిలో ఈ చిత్రాన్ని జనం ఆదరించారు. ఎలాంటి ప్రచారం లేకుండానే స్వచ్చంధంగా ముందుకు రావడం విస్తు పోయేలా చేసింది. కథా పరంగా దమ్ముంటే, వాస్తవాలను తెరపై ఆవిష్కరిస్తే సినిమా సక్సెస్ అవుతుందని ఛావా(Chhaava)ను చూస్తే తెలుస్తుంది. ఈ మూవీ ఏకంగా రూ. 700 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం.
Chhaava Movie OTT Updates
ఇక హిందీ బిగ్ సక్సెస్ కావడంతో మూవీ మేకర్స్ తెలుగు వెర్షన్ లో ఛావాను గత శుక్రవారం రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఆ చిత్రానికి భారీ ఆదరణ లభించింది. కేవలం కొన్ని రోజుల్లోనే రూ. 10 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా లక్ష్మణ్ ఉటేకర్ వైపు దేశం ఆసక్తిగా ఎదురు చూసింది. ఇంత అద్భుతంగా ఎలా తీశాడని కూడా సినీ క్రిటిక్స్ కూడా విస్తు పోయారు. ఇక భారీ ఎత్తున ఓటీటీ సంస్థలు ఛావాను చేజిక్కించుకునేందుకు పోటీ పడినా చివరకు హైయ్యెస్ట్ ధరకు నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఈ మేరకు ఛావాను తామే స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది అధికారికంగా.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. వ్యూహాత్మక గెరిల్లా యుద్దం ద్వారా ఔరంగాజేబు దళాలకు వ్యతిరేకంగా సాగించిన పోరాట సన్నివేశాలను ఛావా ప్రతిఫలించేలా చేసింది. ఏప్రిల్ 11న ఛావా నెట్ ఫ్లిక్స్ లో పలు భాషలలో స్ట్రీమింగ్ కానుంది. అప్పటి దాకా వేచి చూడక తప్పదు.
Also Read : Anaganaga Oka Raju Sensational :ఆసక్తి రేపుతున్న అనగనగా ఒక రాజు