Chhaava : లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 500 కోట్ల వైపు దిశగా కదులుతోంది. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తోంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ కావడంతో మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఛావా(Chhaava) మూవీని తెలుగు వెర్షన్ లో తీసుకు రానున్నట్లు ప్రకటించారు. మార్చి 7న దీనిని తెలుగు ప్రేక్షకుల కోసం రిలీజ్ చేస్తామని తెలిపారు.
Chhaava Movie Telugu Updates
ఛావా సినిమాకు సంబంధించి 17వ శతాబ్దంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. కథను అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశాడు. విరోచితమైన ప్రదర్శనలు, ఛత్రపతి శంభూజీ మహారాజ్ వారసత్వాన్ని ప్రతిఫలించేలా ఛావాను తీశాడు ఉటేకర్.
ఈ సినిమాను చూసేందుకు మరాఠా ప్రజలు పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు తరలి రావడం విస్తు పోయేలా చేసింది. శంభాజీ మహారాజ్ చేసిన విరోచిత పోరాటం ఇందులో కనిపించేలా చేయడం విశేషం. ప్రత్యేకించి బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ శంభాజీ పాత్రకు ప్రాణం పోస్తే తన భార్య ఏసుబాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీనమై పోయి నటించింది. తనకు గత ఏడాది లో పుష్ప2 సూపర్ హిట్ గా నిలిచింది. ఇది రూ. ఏకంగా రూ. 1876 కోట్లు వసూలు చేసింది. కొత్త ఏడాది 2025లో ఛావా దుమ్ము రేపింది. అంతకు ముందు యానిమల్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
Also Read : ‘గంగూబాయి’ని ఎలా మరిచి పోగలను