Chhaava : లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ఛావా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రేమికుల పండుగ రోజు ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు సాధించింది. మరా ఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Chhaava Telugu Trailer Released
సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇతర భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్ . అందులో భాగంగా తాజాగా ఛావా(Chhaava) చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలైంది. ఆకట్టుకునే మాటలు, పవర్ ఫుల్ డైలాగులతో హోరెత్తి పోయింది ఈ మూవీ.
ఇదిలా ఉండగా తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. మార్చి 7న ఛావా తెలుగు మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ చీఫ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు.
మరాఠా యోధుల గురించి తెలుసు కోవడం ప్రతి ఒక్కరి ధర్మం. పేరుకే ఛావా హిందీ చిత్రమైనా కథ గొప్పది. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఇందులో లీనమై పోతారని అన్నారు అల్లు అరవింద్. ఛావాను తెలుగులో కూడా తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు.
Also Read : Raveena Tandon Shocking :పవిత్ర స్నానం చేస్తుంటే వీడియోలు తీస్తారా..?