Chhaava : మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా(Chhaava) చిత్రం రికార్డు బద్దలు కొడుతోంది. విడుదలైన నాటి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 560 కోట్లను అధిగమించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీగా నటించగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న శంభాజీ భార్య ఏసుబాయిగా మెప్పించింది.
Chhaava Movie Sensational Collections
ఛావా చిత్రం 14 రోజుల్లో రూ. 600 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించడం విశేషం. ఆద్యంతమూ ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించేలా చేసింది. ఈ ఛావాను చూసిన ప్రధానమంత్రి మోదీ సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు ప్రముఖ దర్శకుడు ఏఆర్ రెహమాన్. తను అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. విదేశాలలో చావా నిన్న దాదాపు 2.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, 14వ రోజు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 18.54 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 14వ రోజు సంఖ్యలను కలుపుకుంటే, చావా భారతీయ బాక్సాఫీస్ వద్ద 485.52 కోట్ల గ్రాస్ (411.46 కోట్ల నికర) వసూలు చేసింది.
ఓవర్సీస్లో, ఈ చిత్రం ఇప్పటికే 80.50 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ద్వారా భారీ విజయాన్ని సాధించింది. విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 566.02 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.
Also Read : Hero Vijay Deverakonda-Bigg Boss 9:బిగ్ బాస్ హోస్ట్ గా ‘రౌడీ’ నేనా