Chhaava : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఏసు బాయిగా , శంభాజీ మహరాజ్ గా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఛావా చిత్రం వాలంటైన్స్ డే రోజున భారీ అంచనాల మధ్య విడుదలైంది. వీనుల విందైన సంగీతం, అలనాటి చరిత్రాత్మకమైన ఒళ్లు గగుర్పొడిచే కథను కళ్లకు కట్టినట్లు తీయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. విక్కీ కౌశల్ మరోసారి తనేమిటో నిరూపించాడు.
Chhaava Movie Updates
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడే ఈ శంభాజీ మహారాజ్. ప్రత్యేకించి తన భార్యగా లీనమై పోయింది రష్మిక మందన్నా. తను ఇటీవలే నటించిన పుష్ప2 చిత్రంలో కూడా తళుక్కున మెరిసింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది. తనకు ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేయడం పనిగా పెట్టుకుంది.
ఛావా సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఛావా(Chhaava) కథ 17వ శతాబ్దంలో జరిగిన ఘటన ఆధారంగా దీనిని తీశారు. లక్ష్మణ్ ఉటేకర్ తీశాడు. అద్బుతమైన స్టోరీని అందించాడు. అక్షయ్ ఖన్నా ఇందులో విలన్ పాత్ర పోషించాడు. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు ఉన్నాయి. మరాఠా యోధుడి సైనిక విన్యాసాలు ఇందులో చూస్తాం. దర్శకుడితో పాటు ఛావా కోసం ఐదుగురు రచయితలు ప్రాణం పెట్టి కథను రాయడంలో కీలక పాత్ర పోషించారు.
ఛావాను శివాజీ సావంత్ రాసిన అదే పేరుతో ఉన్న నవల నుండి స్వీకరించే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. ఒక రాజ వంశాన్ని బలోపేతం చేసిన పాలకుడిని కలిపి ఉంచేలా చేసింది. శంభాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం పిలుపు ఇవ్వడం నుండి ఔరంగజేబు అమానవీయ దోపిడీల వరకు ఈ సినిమా చెప్పే ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఛావా.
Also Read : ఆశలపై నీళ్లు చల్లిన విశ్వక్ సేన్ లైలా